![]() |
![]() |

సోషల్ మీడియాలో హాట్ గా హీట్ పుట్టించే భామ ఆరియానా. రకరకాల రీల్స్ చేస్తూ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ అందరినీ తన వైపుకు తిప్పుకుంటుంది. ఐతే త్వరలో ప్రేమికుల దినోత్సవం రాబోతోంది. దాంతో ఇక మూవీలో ఉన్న ప్రేమ, పెళ్లి సీన్స్ ని బయటకు తీసి రీల్స్ గా చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అందాల భామ కూడా అలాంటి ఒక రీల్ చేసిందండోయ్...ఆ డైలాగ్ మావిచిగురు మూవీలో శ్రీలక్ష్మి, బాబు మోహన్, బ్రహ్మానందం మధ్యన జరిగే "నా మనసు నాకు ఇచ్చేయ్ గోపి" అనే మోస్ట్ ఫన్నీ డైలాగ్. ఇక ఈ ముగ్గురి ప్లేస్ లో ఎవరెవరు చేశారో తెలుసా ఆరియానా, ముక్కు అవినాష్ తమ్ముడు అజయ్, రోల్ రైడా.

"గోపి నువ్వు సచ్చావునుకుని ఈ అడ్డగాడిదను చేసుకున్నాను..నేనిప్పుడు వీడి భార్యను... పతివ్రతా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాను...మనిషిని వీడి దగ్గర ఉన్నా కానీ మనసు నీ దగ్గర బ్లాక్ ఐపోయింది" అంటూ సినిమాలో శ్రీలక్ష్మి చాలా ఎమోషనల్ గా చెప్పింది. ఇదే డైలాగ్ తో ఆరియానా టీమ్ రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "ఇచ్చేయ్ గోపి..ఎందుకు మనకు ఇదంతా...అక్కా సంపేశావ్ ...పతివ్రత స్టాండర్డ్స్ గురించి మీరే చెప్పాలి. సూపర్ గా చేశారు" అంటూ చెప్తున్నారు. ఆరియానా డైరెక్టర్ ఆర్జీవీతో కలిసి చేసిన రచ్చ ఓ రేంజిలో క్రేజ్ ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది. బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమాల్లోనూ కనిపిస్తోంది ఈ అమ్మడు.
![]() |
![]() |